ఆంధ్ర ప్రదేశ్

ఇక పై తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా పింఛను : సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు లేని పిల్లలకు శుభవార్త చెప్పారు. తల్లిదండ్రులు చనిపోయిన వారి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇక పై పింఛన్లు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ముసలివారికి పింఛన్లు అందజేస్తుండగా వారితో పాటుగా తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా పింఛన్లు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు.

కేంద్రం తీపి కబురు!… ఉచిత బీమా కింద వృద్దులందరికీ ఐదు లక్షలు?

ఇక రానున్న మూడు నెలల్లో అనర్హులను గుర్తించి వారి పింఛన్లు వెంటనే కట్ చేయాలని అధికారులను హెచ్చరించారు. ఆ తర్వాత కూడా అనర్హులని తేలితే కచ్చితంగా ఆయా జిల్లాల కలెక్టర్ల నే బాధ్యులను చేస్తానని సీఎం చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే చాలా మందికి అర్హత ఉన్నవాళ్లకి పింఛన్లు అందజేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.

ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్?

అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 లక్షలకు పైగా అనర్హులకు పింఛను పంపిణీ అవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కాబట్టి అనర్హులను వెంటనే కట్ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే పింఛన్లు అందజేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కాబట్టి వచ్చే మూడు నెలల్లో ప్రతి ఒక్క పెన్షన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని చంద్రబాబు నాయుడు కోరారు. అలాగే మూడు నెలల లోపు అంగవైకల్యం , పోలియో అంశాలపై ఒక రిపోర్ట్ సిద్ధం చేయడంతో పాటుగా, గోదావరి పురస్కారాలకు కావలసినటువంటి ప్లానింగ్ కూడా పూర్తి చేయాలని అధికారులను కోరారు.

నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ టాప్.. అదరగొట్టిన పవన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button