రెండు సంవత్సరాల క్రితం ప్రపంచమంతా కూడా కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. కరోనా అన్న విషయం తలుచుకుంటేనే ప్రజలందరూ గుండెల్లో భయం మొదలవుతుంది. కరోనా మహమ్మారి కారణంగా కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. ఇక తరువాత కరోనా కి వ్యాక్సిన్ రావడంతో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు.
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం: కేటీఆర్
ఇక తాజాగా ఉగాండా అనే దేశంలో కరోనా మహమ్మారి లాంటి ఒక కొత్త రోగం పుట్టుకొచ్చింది. దీని పేరు “డింగా డింగా”. ఈ డింగా డింగా వ్యాధి బారిన పడ్డవారు డాన్స్ చేస్తున్నట్లుగా వణికి పోతూ ఉంటారు. కొన్ని రోజులుగా ఆ దేశంలో ఈ కొత్త రోగం బారిన పడి చాలా మంది భయంకు గురవుతున్నారు. ఒక రోజులోనే ఏకంగా 300కు పైగా కేసులు నమోదవుతుండడంతో ఒకవైపు డాక్టర్లు అలాగే మరోవైపు ప్రజలు పెద్ద ఎత్తున భయపడుతున్నారు.
పార్టీ పెట్టబోతున్న అల్లు అర్జున్!.. వేణు స్వామి వ్యాఖ్యలు వైరల్?
అసలు ఈ రోగం ఎందుకు వస్తుందో, ఎటువంటి మందులు వాడాలో తెలియక డాక్టర్లు కూడా తల పట్టుకుంటున్నారు. ఈ రోగం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా డాన్స్ చేస్తున్నట్లుగా ఒళ్ళు మొత్తం ఊగిపోతుంటుంది. వీటితో పాటుగా జ్వరం, శరీర వీక్నెస్, పక్షవాతం లాంటి ఫీలింగ్స్ అనేవి ఈ రోగం బారిన పడిన వారికి వస్తున్నాయి. మరి కొంతమంది ఈ వ్యాధి సోకినవారు అసలు నడవలేకపోతున్నారు. దీంతో ఉగాండా దేశం మొత్తం కూడా అలర్ట్ అయింది.