
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్త ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో భారీ అంచనాల మధ్య ఢిల్లీలో ఎన్నికలు జరగగా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ బిజెపి అధికారంలోకి వచ్చింది. నిన్న మొన్నటి వరకు ఆప్ పార్టీ ఢిల్లీలో చాలా బలంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దేశంలోని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయేలా ఈసారి ఢిల్లీలో కాషాయం జెండా ఎగురుతుంది. ఇక తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బిజెపి అధిష్టానం నిర్ణయించింది . అయితే ఇవాళ రేఖ గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది.
ఆమె చేత ఎల్జి వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. మంత్రులుగా పర్వేష్ సింగ్, ఆశిష్ సూద్ , మంజీందర్ సింగ్, రవీందర్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
1.జగన్ కు భారీ భద్రతను కల్పించమని గవర్నర్ ను కలిసిన వైసీపీ నాయకులు!..