
క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి :- శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప అనుబంధ గ్రామమైన మరాటిగూడలో చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా వన్నె ఫామ్ హౌస్ అధినేత శివశంకర్ చత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి అయ్యే ఖర్చులు భరిస్తానని హామీ ఇచ్చారు. సోమవారం గ్రామ శివారులో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి, భూమి పూజ చేశారు. గ్రామస్తులు విగ్రహ దాతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల బిజేవైఎం వైస్ ప్రెసిడెంట్ అప్పారావు, వెంకట్రావు, రాజేందర్, భాస్కర్,సురేష్, బాలాజీ, రాజు, సుధాకర్, ప్రకాష్, పాండు, రవి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
1.రాష్ట్రంలో ఖజానా ఖాళీ అంటున్న ముఖ్యమంత్రులు!… క్రైమ్ మిర్రర్ ప్రత్యేక కథనం… ప్రజల కోసం?
2.చిన్నారులను మింగేస్తున్న బోరుబావులు-రాజస్థాన్‌లో ఐదేళ్ల చిన్నారి మృతి
3. పీఎం కిసాన్ పేరుతో సైబర్ వల…ఏపీకే ఫైల్స్ పంపి అకౌంట్లు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు