
ఇజ్రాయెల్, హమాస్ మధ్య తాజాగా 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల వ్యవధిలో బందీలను విడుదల చేయకపోతే హమాస్ ను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తామని హెచ్చరించారు.
బందీల కుటుంబాలను కలిసిన నెతన్యాహు
తాజాగా హమాస్ చెరలో ఉన్న బందీల కుటుంబానికి నెతన్యాహు కలిశారు. హమాస్ చెరలో ఉన్న బందీలను కచ్చితంగా తిరిగి తీసుకొస్తామని చెప్పారు. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం సమయంలోనే సాధ్యమైనంత వరకు బందీలను విడిపిస్తామన్నారు. హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఇంకా ముగియలేదన్న ఆయన.. తాత్కాలిక కాల్పుల విరమణ అనేది తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యాన్ని సాధించకుండా అడ్డుకుందన్నారు.
ట్రంతో సమావేశం తర్వాత కాల్పుల విరమణ ప్రకటన
ఇరాన్ తో యుద్ధం తర్వాత హమాస్ గురించి చర్చించేందుకు తాజాగా నెతన్యాహు, ట్రంప్ తో సమావేశం అయ్యారు. ఈ చర్చల తర్వాత హమాస్ తో తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించారు. 60 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించినట్లు తెలిపారు. గాజాలో పూర్తి నిరాయుధీకరణ, సైనికులను తొలగించడం, బందీలను విడుదల చేయడం లాంటి షరతులతో ఈ కాల్పుల విరమణకు ఒప్పుకుంటున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. ఈ రెండు నెలల్లో ఇవన్నీ జరిగితే ఇజ్రాయెల్ దాడులు చేయదు. ఒకవేళ ఉల్లంఘిస్తే, హమాస్ అంతం ఖాయమన్నారు నెతన్యాహు. ఈసారి దాడులు మరింత తీవ్రంగా ఉంటాయన్నారు. ఇప్పటికే హమాస్ సైనిక సామర్థ్యాలను చాలా వరకు ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. హమాస్ విషయంలో దౌత్యం, సైనిక శక్తి ద్వారా పని చేయాలనుకుంటున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. దౌత్యం పని చేయకపోతే సైన్యం తమ పని తాము చూసుకుంటుందని తేల్చి చెప్పారు.
Read Also: రైతుగా మారి.. అంతరిక్షంలో ఆకుకూరలు పెంచుతున్న శుభాన్షు!