
Nepal PM Oli On Lord Ram: శ్రీ రాముడు ఎక్కడ పుట్టాడు? ఎవరిని అడిగినా అయోధ్యలో అని వెంటనే చెప్పేస్తారు. కానీ, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వాదాన మరోలా ఉంది. శ్రీరామ చంద్రుడు నేపాల్ లోనే పుట్టారంటూ హాట్ కామెంట్స్ చేశారు. శ్రీరాముడు మాత్రమే కాదు, శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్ లోనే పుట్టారని చెప్పుకొచ్చారు.
నేపాల్ రాజధాని ఖాఠ్మండులో నిర్వహించిన కార్యక్రమంలో ఓలి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరాముడు నేపాల్ లో జన్మించారని చెప్పుకొచ్చారు. వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగానే తాను ఈ వ్యాఖ్యలు చేశానన్నారు. “రాముడు పుట్టిన స్థలం నేపాల్ లోనే ఉంది. అయినప్పటికీ ఈ విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ కాలేకపోతున్నాం. రాముడు పుట్టింది నేపాల్ లో అయితే, రామ జన్మస్థం గురించి వేరే కథలు ఎలా సృష్టిస్తారు?” అని ఓలి ప్రశ్నించారు.
రాముడు పుట్టింది నేపాల్ థోరిలోనా?
శ్రీరాముడు నేపాల్ లోని చిత్వాన్ జిల్లా థోరిలో పుట్టారని ఓలి గతంలోనూ చెప్పారు. 2020 జూలైలో శ్రీరామ జన్మస్థానం గురించి మాట్లాడిన ఆయన, రాముడు తమ దేవంలోనే పుట్టాడని చెప్పారు. అక్కడ రామ మందిరం నిర్మించాలని తాను ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అంతేకాదు, దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన ప్రాంతం కూడా నేపాల్‌లోనే ఉందన్నారు. ప్రస్తుతం ఓలి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నారు. రాముడు పుట్టింది అయోధ్యలో అయితే, ఆయన నేపాల్ అని చెప్పడంతో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: ఉగ్రవాదంపై రెండు మాటలు వద్దు.. పాక్, చైనాపై మోడీ ఘాటు వ్యాఖ్యలు!