
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- మండలాభివృద్ది కోసం ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిన ఆ నిధులు దుర్వినియోగం అవుతుండడం ప్రజలను కలవరపెడుతోంది. మహాదేవపూర్ మండలం,సూరారం గ్రామం నుండి క్రిష్టారావు పేట రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో క్రిష్టారావు పేట సమీపంలోని సీసీ రోడ్ల నిర్మాణం నాసిరకంగా వేశారు. రోడ్డు నిర్మాణం జరిగి సంవత్సరం తిరగకుండానే రోడ్డు మధ్యలో నెర్రెలు వారిపోయింది. దీంతో ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం పట్ల సరైన పర్యవేక్షణ మరియు నాణ్యత నియంత్రణ చర్యలు లేకపోవడం తక్కువ నాణ్యత గల కాంక్రీటు, సిమెంట్ మరియు బిటుమెన్ వాడకం రోడ్లు త్వరగా విచ్ఛిన్నం కావడానికి కారణమవుతుంది. దాదాపుగా కోటి రూపాయల ప్రజాధనం రోడ్డుపాలు చేశారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ నాసిరకం పనులకు కారణం కాంట్రాక్టర్లా.. లేక స్థానిక ప్రజా ప్రతినిధులా అని ఆరా తీస్తున్నారు. ఇప్పుడిప్పుడు వేసిన రోడ్లే ఇలా ఉంటే.. భవిష్యత్తులో వచ్చే వర్షాకాలం నాటికి ఈ రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో .. అసలు రోడ్డు కనిపిస్తుందా.. అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజల ఆవేదన మేరకు స్థానిక ఎమ్మెల్యే రోడ్డు పరిస్థితిని మళ్ళీ సంబంధిత అధికారులతో పరిశీలించి, నిర్లక్ష్యం ఎవరిదో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Read also : మందమర్రి ఆర్కే-1ఏ అటవీ ప్రాంతంలో వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర
Read also : ఇన్‌స్టా పరిచయంతో మహిళ ఎఫైర్.. ప్రైవేట్ ఫొటోలతో వేధింపులు!





