జాతీయం

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌, ఇంతకీ ఏంటీ ఆయన బ్యాగ్రౌండ్!

NDA Vice President Candidate CP Radhakrishnan  : ఎన్టీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగి సీపీ రాధాకృష్ణన్‌ ను ఎంపిక చేశారు. ఈమేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌.. స్వస్థలం తమిళనాడు. సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసతూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌ అనంతరం ఈ విషయాన్ని నడ్డా తెలిపారు.

ఎవరీ సీపీ రాధాకృష్ణన్?

సీపీ రాధాకృష్ణన్ మే 4  1957న జన్మించారు. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌ సభ స్థానం నుంచి రెండు సార్లు బీజేపీ ఎంపీగా ఎన్నిక అయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగానూ ఆయన పని చేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్‌ ఇండియా కాయర్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ గా సేవలు అందించారు. తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకులలో ఆయన ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి జార్ఖండ్‌ గవర్నర్‌ గా బాధ్యతలు చేపట్టారు. గతంలో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గానూ ఆయన అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌ గా కొనసాగుతున్నారు సీపీ రాధాకృష్ణన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button