
NASA-ISRO NISAR Satellite: నాసా-ఇస్రో సంయుక్తంగా చేపట్టిన నిసార్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యింది. శ్రీహరికోట నుంచి సాయంత్రం 5.40 గంటలకు GSLV-F16 రాకెట్ ద్వారా సింథెటిక్ అపర్చర్ రాడార్ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లింది. నిన్న సాయంత్రం కౌంట్ డౌన్ ప్రారంభం కాగా, ఇవాళ సాయంత్రం ప్రయోగం నిర్వహించారు. వాతావరణానికి సంబంధించి ముందస్తు సమాచారం కోసం నాసా- ఇస్రో కలిసి సంయుక్తంగా ఈ ప్రయోగం చేపడుతున్నాయి.
నిసార్ ఉపగ్రహం గురించి..
నిసార్ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు ఓసారి భూమి చుట్టూ తిరుగుతుంది. వాతావరణానికి సంబంధించి 3D ఫోటోలను పంపిస్తుంది. ఈ సాటిలైట్ మొత్తం 2,392 కిలోల బరువు ఉంటుంది. ప్రపంచంలోనే తొలి డ్యూయెల్ ఫ్రీక్వెన్సీ రాడార్ తో భూమిని పరిశీలించే ఉపగ్రహం కానుంది. ఈ శాటిలైట్ లో డ్యూయెల్ రాడర్ సిస్టమ్ నాసా ఎల్-బ్యాండ్, ఇస్రో ఎస్- బ్యాండ్ కలిసి డేటాను అందిస్తాయి. ఈ రెండూ నాసాకు చెందిన 12 మీటర్ల అన్ ఫర్లయిబుల్ మెష్ రిఫ్లెక్టర్ యాంటినాను ఉపయోగిస్తాయి. నిసార్ తొలిసారి స్వీప్ సార్ టెక్నాలజీని ఉపయోగించి 242 కిలో మీటర్ల విస్తీర్ణంతో హై స్పేషియల్ రిజల్యూషన్ లో భూమిని పరిశీలిస్తుంది.
నిసార్ ప్రయోగంతో కలిగే లాభాలు ఏంటి?
నిసార్ ఉపగ్రహం వాతావరణ మార్పుల గురించి ఆరా తీస్తుంది. అంతరిక్షం నుంచి ఇస్రోతో పాటు నాసాకు సమాచారం అందిస్తుంది. భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు, తుఫాన్లు, వరదలకు సంబంధించి ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తుంది.