
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- నర్సపూర్ బివిఆర్ఐటిలొ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జరిగింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పుల్లూరు గ్రామానికి చెందిన తరుణ్ (20) నర్సపూర్ పట్టణ సమీపంలో ఇంజనీరింగ్ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నర్సాపూర్ లొ ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ రోజు కళాశాలకు వెళ్లి వస్తుఉండేవాడని తెలిసింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో తాను ఉండే హాస్టల్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింగం తెలిపారు.
నల్గొండలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం… త్వరలోనే ఎన్నికల షెడ్యూల్!