
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్నటువంటి మహా కుంభమేళ ఉత్సవాలలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ భార్య బ్రాహ్మణి మరియు కుమారుడు దేవాన్ష్ తో కలిసి త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేశారు. ఇక అంతకుముందు ఒక పడవలో నదుల సంగమం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ప్రయాగ్ రాజ్ పద్ధతి తీసుకున్న సెల్ఫీలు నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. “నిజంగా ఆశీర్వదించబడ్డాం” అంటూ నారా లోకేష్ ఆ ఫొటోస్ కింద క్యాప్షన్ ఇచ్చారు.
ట్రోల్స్ కు గురవుతున్న మాజీ ఎంపీ కేసినేని నాని !.. ఎందుకంటే?
కాగా ఈనెల 26వ తారీకు వరకు ఈ మహా కుంభమేళా ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటివరకు ఏకంగా 40 కోట్ల మందికి పైగా జనాలు ఈ మహా కుంభమేళా ఉత్సవాల్లో పాల్గొని పుణ్య స్నానాలను ఆచరించారు. ప్రపంచ నలుమూలల నుండి సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున వచ్చి మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ మహా కుంభమేళా అనేది దాదాపుగా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇక కేవలం పది రోజులు మాత్రమే ఉండడంతో ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పెట్టేసి మరి వచ్చి దర్శించుకుంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కి బర్త్డే విషెస్ తెలిపిన ముఖ్యమంత్రి!..తెలంగాణ లో తగ్గిన రాజకీయ వేడి?
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పలో వరల్డ్ హెరిటేజ్ వాక్…