
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ ముఖ్య నాయకులు విమానాలలో తిరుగుతూ ప్రజల ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తున్నారు అని తీవ్రంగా ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ వీరందరూ కూడా పదేపదే ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు ఇతర టూర్లకు విమానాలను అలాగే హెలికాప్టర్లకు ప్రజల సొమ్మును ఉపయోగిస్తున్నారు అని సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు ఆరోపించారు. అయితే ఈ విషయంపై తాజాగా మంత్రి నారా లోకేష్.. జగన్ గత ఐదేళ్లలో ఎన్నిసార్లు విమానాలలో ప్రయాణించారో.. ఎన్ని కోట్లు విమానాలకు ఖర్చు పెట్టారో ఆ లెక్కలన్నీ కూడా బయటపెట్టారు. గత ఐదేళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విమాన ప్రయాణాలకు గాను ఏకంగా 222 కోట్లు ఖర్చు చేశారు అని మంత్రి నారా లోకేష్ NDTV ప్రచురించిన కథనాన్ని తాజాగా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ప్రజలు గత ఐదేళ్ల కాలంలో ఉద్యోగాలు అలాగే కొన్ని సౌకర్యాల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతుంటే జగన్ మాత్రం విహారయాత్రలకు కొన్ని కోట్ల రూపాయల ఖర్చు చేశారని తీవ్రంగా విమర్శించారు. మేము విమానాలలో తిరుగుతున్నామంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ జగన్ మాత్రం విహారయాత్రలకు, తన నివాసాలకు కూడా విమానాలు అలాగే హెలికాప్టర్లు ఉపయోగించి 222 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు అని తెలిపారు. ఇవి జగన్ విమానాల లెక్కలు అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.
Read also : Mahesh Babu: వారణాసి సినిమా షూటింగ్‌కు బ్రేక్!
Read also : లక్ష్మిదేవిగుడెం గ్రామ అభివృద్దే శ్వాసగా పని చేస్తా- ఎలికేటి భరత్





