
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో భాగంగా మంత్రి నారా లోకేష్ కీలక వైఖ్యలు చేశారు. దాదాపు 43 ఏళ్ల క్రితం నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోని అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారని అన్నారు. రాష్ట్రంలో రికార్డులు సృష్టించాలన్నా లేదా వాటిని బద్దలు కొట్టాలన్న ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమని మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. NTR అనే మూడు అక్షరాలు తెలుగువారి ఆత్మగౌరవం అని నారా లోకేష్ అన్నారు. అప్పటికి, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అన్నా… నందమూరి తారకరామారావు అన్న చాలా గౌరవం ఉంటుందని నారా లోకేష్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీకి గల్లి, ఢిల్లీ పాలిటిక్స్ గురించి చాలా బాగా తెలుసు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తానని రాష్ట్రంలో చాలామంది ప్రతిపక్ష నేతలు నూటికి వచ్చినట్లు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయారు అని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.