Monday, March 16, 2026
HomeతెలంగాణCleanup Initiative: కార్పొరేటర్ దీప్లా నాయక్ ఆధ్వర్యంలో కంప చెట్ల తొలగింపు!

Cleanup Initiative: కార్పొరేటర్ దీప్లా నాయక్ ఆధ్వర్యంలో కంప చెట్ల తొలగింపు!

క్రైమ్ మిర్రర్, నల్లగొండ: ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కంపచెట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు నల్లగొండ 9వ డివిజన్ కార్పొరేటర్ బాణావత్ దీప్లా నాయక్. డివిజన్ పరిధిలో రోడ్లకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జేసీబీ సాయంతో తొలగించారు. న్యూ చైతన్యపురి కాలనీ సహా పలు కాలనీల్లో ఈ కార్యక్రమం కొనసాగింది. రోడ్లకు ఇరువైపులా రాకపోకలు ఇబ్బంది కలిగించేలా ఉన్నకంపచెట్లను తీసివేయించారు. రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.

పరిసరాలను పరిశుభ్రత అందరి బాధ్యత!

అటు కొద్ది రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో డివిజన్ పరిధిలోని మురుగు నీరు నిలిచే ప్రదేశాలను జేసీబీ సాయంతో శుభ్రం చేయించారు. మట్టిపోసి గుంతలు పూడ్చారు. ఈ సందర్భంగా.. మాట్లాడిన కార్పొరేటర్ దీప్లా నాయక్.. ప్రజలంతా పరిసరాల శుభ్రత పాటించాలని సూచించారు. చెత్తా చెదారాన్ని పరిసరాల్లో పారవేయకూడదన్నారు. ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు దోమలు పెరిగి, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. చెత్తను పడేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి శానిటేషన్ ఆటోవాలాలకు ఇవ్వాలన్నారు. అలా చేయండ వల్ల పరిసరాలు శుభ్రంగా ఉండటంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.

కంపచెట్ల తొలగింపు కార్యక్రమంలో కార్పొరేటర్ దీప్లానాయక్ తో పాటు వజ్జ శ్రీనివాస్ యాదవ్, కునుకుంట్ల శంకర్, కన్నెబోయిన నగేష్, కన్నెబోయిన రమేష్, శాటినిటేషన్ జవాన్ పెరిక సైదులు, శానిటేషన్ వర్కర్ బొజ్జ యాదయ్య, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

Read Also: అనునిత్యం ప్రజల్లో ఉంటా.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తా: దీప్లా నాయక్

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments