
Suryapet 6th Ward Councillor Nomination: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నామినేషన్ల గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తపున నాగిరెడ్డి సందీప్ రెడ్డి గురువారం నామినేషన్ వేశారు. తన అనుచరులతో కలిసి సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
అభివృద్ధి చేస్తా, ఆదరించండి!
నామినేషన్ సమర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడిన సందీప్ రెడ్డి.. వార్లు ప్రజలు తనకు అవకాశం కల్పించాలన్నారు. వార్డు ప్రజలు ఆశీర్వదించి, కౌన్సిలర్ గా పనిచేసే అవకాశం కల్పిస్తే, ప్రజలకు సేవ చేస్తానన్నారు. 6వ వార్డు ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. తన సమస్యగా భావించి పరిష్కరిస్తానన్నారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు అవకాశం కల్పిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
అటు నామినేషన్ కార్యక్రమంలో బానోతు శ్రీను,మెహిబ్ పాషా, వరుణ్ రాకేష్ నాగరాజు, బబ్లు, సుభాష్ సతీష్,కళ్యాణ్ సహా పలువురు అనుచరులు పాల్గొన్నారు.





