మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలు మరింత ముదురుతున్నాయి. తనను తండ్రి మోహన్ బాబు కొట్టాడని చెబుతున్న మనోజ్ బాబు.. పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మనోజ్ మెడికల్ రిపోర్టులోనూ ఆయన శరీరంలో అనుమానాస్పద గాయాలు ఉన్నట్లు తేలింది. ఈ విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మంచు మనోజ్- మౌనిక దంపతులు.
Read More : రూపాయి నాణేలతో ఐఫోన్ కొని షాక్ ఇచ్చిన బిచ్చగాడు?
తనపై కొడుకు చేస్తున్న ఆరోపణలతో మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు. మనోజ్ కు కౌంటర్ గా మోహన్ బాబు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. తన చిన్న కుమారుడు మంచు మనోజ్, అతని భార్య మౌనికల నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వారి నుంచి తనకు, తన ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలోని మంచు టౌన్ లో గత 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నానని, ఇప్పుడు ఆ ఇంటిని మనోజ్, మౌనికలు ఆక్రమించుకొని ప్రైవేటు వ్యక్తులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలుగు నెలల కిందటే మనోజ్ ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయాడని, ఇప్పుడు కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి తన ఇంటి వద్ద కలవరం సృష్టిస్తున్నాడని వాపోయాడు మోహన్ బాబు. తన భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయంగా ఉందన్నారు.
Read More : పుష్ప సినిమాకి బలైన మరో యువకుడు!..
మాదాపూర్ లోని తన కార్యాలయంలోకి 40 మంది ప్రైవేటు వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించినట్లు రాచకొండ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదలో మోహన్ బాబు రాసుకొచ్చారు. చట్టవిరుద్ధంగా తన ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మనోజ్, మౌనికలు ప్లాన్ చేశారనే అనుమానం ఉందని, ప్రైవేటు వ్యక్తులతో ఆక్రమించుకొని భయపెడుతున్నారని మోహన్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. 78 ఏళ్ల సీనియర్ సిటీజనైనా తనకు అదనపు భద్రత కల్పించాలని, తన ఇంట్లో అనధికారికంగా ఉంటున్న మనోజ్, మౌనికలను పంపించాలని, తన ఇంట్లో ఎలాంటి భయం లేకుండా జీవించేందుకు రక్షణ కల్పించాలని మోహన్ బాబు రాచకొండ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు
Read More : ఏలూరులో దారుణం!… హాస్టల్ బాత్రూంలో విద్యార్థి డెలివరీ?