Sunday, March 1, 2026
HomeజాతీయంMutton Curry: మటన్ కర్రీని ఇలా వండి తింటే.. ముక్కతో పాటు చేతి వేళ్లను కూడా...

Mutton Curry: మటన్ కర్రీని ఇలా వండి తింటే.. ముక్కతో పాటు చేతి వేళ్లను కూడా వదలరు..

Mutton Curry: తక్కువ మసాలాలతో, ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే సులభంగా తయారయ్యే రుచికరమైన వంటకం మటన్ ఉప్పు కర్రీ. ప్రతిరోజూ ఏమి వండాలా అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా, తక్కువ సమయంలో ఎంతో రుచిగా చేసుకునే స్పెషల్ డిష్ ఇది. సాధారణంగా మటన్ కూర అంటే ఎక్కువ మసాలాలు, ఎక్కువ సమయం అనిపిస్తుంది. కానీ ఈ రెసిపీలో మసాలాల ఘాటు తక్కువగా ఉన్నా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ మళ్లీ మళ్లీ కావాలని అడిగేలా ఈ వంటకం ఉంటుంది. అయితే, ఈ కర్రీ రుచిగా రావాలంటే సరైన కొలతల్లో పదార్థాలు ఉపయోగించడం ముఖ్యం.

కావలసిన పదార్థాలు..

మటన్- ½ కిలో (శుభ్రం చేసినది)

చిన్న ఉల్లిపాయలు- 30 (ముక్కలుగా)

ఎండుమిర్చి- 15-20 (కారానికి తగ్గట్టు)

వెల్లుల్లి రెబ్బలు- 15–20

టమాటా- ½ (సన్నగా తరిగినది)

పసుపు- ¼ టీ స్పూన్

ఉప్పు- రుచికి సరిపడా

కరివేపాకు- 2 రెమ్మలు

నువ్వుల నూనె- 3-4 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం..

1. ముందుగా సిద్ధం చేసుకోవాలసినవి..

మటన్‌ను ఉప్పు, పసుపుతో 2-3 సార్లు కడగాలి.

ఉల్లిపాయలు, వెల్లుల్లి తొక్క తీసి సిద్ధం పెట్టాలి.

టమాటా తరిగి పెట్టుకోవాలి.

2. వేయించడం..

మందపాటి కడాయిలో నువ్వుల నూనె వేడి చేయాలి.

ముందుగా ఎండుమిర్చి వేసి వేయించాలి.

వెంటనే వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

కరివేపాకు, పసుపు వేసి కలపాలి.

3. మటన్ వేసే దశ..

ఉప్పు వేసి టమాటా కలపాలి.

టమాటా మెత్తబడిన తర్వాత మటన్ ముక్కలు వేసి 5 నిమిషాలు బాగా కలపాలి.

మసాలా మటన్‌కు బాగా పట్టేలా వేయించాలి.

4. ఉడికించడం..

మటన్ మునిగేంత నీళ్లు పోసి మూత పెట్టాలి.

మధ్య మంటపై మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

మధ్య మధ్యలో కలపాలి.

నీరు పూర్తిగా ఇంకిపోయి నూనె పైకి తేలే వరకు ఉంచాలి.

డ్రైగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.

టేస్ట్ టిప్స్..

* నువ్వుల నూనె వాడితే స్పెషల్ రుచి వస్తుంది
* ప్రెషర్ కుక్కర్‌లో 4-5 విజిల్స్ ఇచ్చి, తర్వాత కడాయిలో డ్రై చేసుకోవచ్చు
* చివర్లో కొద్దిగా మిరియాల పొడి చల్లితే సూపర్ ఫ్లేవర్

వేడి అన్నం మీద ఈ మటన్ ఉప్పు కర్రీ వేసుకుని తింటే నిజంగా మరపురాని రుచి! ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఆదివారం ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పాలి మరి..

ALSO READ: మీకు తెలుసా?.. ఇండియాకు 80 శాతం బంగారం వచ్చేది ఎక్కడి నుంచో?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments