బాలీవుడ్ నటుడు ముస్తాక్ ఖాన్ ను ఎవరో గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇతను స్త్రీ-2 మరియు వెల్కమ్ చిత్రాలలో నటించి మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు.నవంబర్ 20వ తారీఖున ఈ ఘటన జరగక ఆలస్యంగా వెలుగులోకి రావడం అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆరోజున ఓ అవార్డ్ ఫంక్షన్ హాజరైనందుకు ఢిల్లీ వెళ్లిన ముస్తాక్ ఖాన్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉత్తరప్రదేశ్ తీసుకెళ్లారట.
Read More : ఫలించిన పవన్ కళ్యాణ్ కృషి… నాగబాబుకు కీలక పదవి?
ఇక దాదాపుగా 12 గంటల పాటు ఈ బాలీవుడ్ నటుడు ముస్తాక్ ఖాన్ ను విపరీతమైన టార్చర్ పెట్టారట. కొద్దిసేపటికి అతని కొడుక్కి ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేయగా ఈ విషయం తాజాగా మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే కోటి రూపాయలు డిమాండ్ చేసిన కొద్దిసేపటికి ఆ కిడ్నాప్ చేసిన దుండగుల నుంచి ముస్తాక్ ఖాన్ తప్పించుకొని బయటకు వచ్చాడట. ఇక ఈ విషయాన్ని నేరుగా ఆయన ఫ్రెండ్ శివం తెలిపారు అని మీడియా కథనాలు వెల్లడించాయి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ అంతా కూడా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఎవరో తమకు తెలియదని నటుడు చెప్పినట్లు పోలీసులు వివరించారు. కేవలం డబ్బు కోసమే ఇలా చేసి ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు.
Read More : పుష్ప సినిమాకి బలైన మరో యువకుడు!..
Read More : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తాము అంటూ బెదిరింపులు?