గ్రేటర్ హైదరాబాద్ లో అత్యంత కీలకమైన ఎల్బీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పరిస్ఖితి అధ్వాన్నంగా తయారైంది. లీడర్ల మధ్య ముసలం పుట్టడంతో కాంగ్రెస్ కేడర్ ఆగమాగమవుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన మధుయాష్కీ ఒక వర్గంగా.. పాత నేతలంతా మరో వర్గంగా తయారై కత్తులు దూసుకుంటున్నారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవులు రెండు వర్గాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. మధుయాష్కీ పీఆర్వో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తనకు నచ్చిన వారికి ఎంకరేజ్ చేస్తూ పాత నేతలను టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మధుయాష్కీకి తెలియకుండా సొంతంగానే తన సైన్యం ఏర్పాటు చేసుకుని పీఆర్వో వసూళ్ల దందాకు తెర తీశాడనే ఆరోపణలు వస్తున్నాయి.
ఎల్బీనగర్ నియోజరవర్గంలో గతంలో రిపోర్టుగా పని చేసిన వ్యక్తి మధుయాష్కీకి పీఆర్వో ఉన్నారు. నియోజకవర్గంలో గతంలో తనకున్న పరిచయాలతో మధుయాష్కీ పేరు చెప్పుకుని రెచ్చిపోతున్నాడని తెలుస్తోంది. నామినేటెడ్ పదువులు, పార్టీ పదవుల విషయంలోనూ మధుయాష్కీ పీఆర్వో వసూళ్ల దుకాణం తెరిచారని కాంగ్రెస్ కేడరే చెబుతోంది. పదవికో రేటు ఫిక్స్ చేసి… నోట్ల కట్టలు ఇచ్చిన వారికే మధుయాష్కీ ద్వారా పదవులు ఇప్పిస్తున్నారని అంటున్నారు. పదవుల విషయంతో మధుయాష్కీని పీఆర్వో తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మధుయాష్కీ పీఆర్వో అక్రమ దందాలతో నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి సర్కార్ కు , కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు వస్తుందని మండిపడుతున్నారు.
హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులకు సంబంధించి మధుయాష్కీ పీఆర్వో భారీగా డబ్బులు వసూల్ చేశారని తెలుస్తోంది. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఆంధ్ర ప్రాంతానికి చెందిన నేలపాటి రామారావు చౌదరిని ఎంపిక చేశారు. ఇదే ఇప్పుడు నియోజకవర్గ కాంగ్రెస్ లో సెగలు రేపుతోంది. రామారావు చౌదరికి కాంగ్రెస్ పార్టీలో సాధారణ సభ్యత్వం కూడా లేదని.. అలాంటి వ్యక్తికి ఎలా పదవి ఇస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లీడర్లు ఉన్నా ఎవరిని పట్టించుకోకుండా.. నేలపాటి రామారావు చౌదరికి మధుయాష్కీ పీఆర్వో డైరెక్టర్ పదవి ఇప్పించారని అంటున్నారు. ఇందుకోసం రామారావు దగ్గర భారీగా డబ్బులు తీసుకున్నారని అంటున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డితో సంబంధం లేకుండానే మధుయాష్కీ పీఆర్వో తన ఇష్టం ఉన్నవారికి పోస్టులు ఇప్పిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జక్కిడితో పాటు నియోజకవర్గంలోని బలమైన నేతలను వీక్ చేసేలా మధుయాష్కీ పీఆర్వో కుట్రలు చేస్తున్నారని.. పదవుల ఆశ చూపి వాళ్లను తమవైపు తిప్పుకుంటున్నారని అంటున్నారు.
పీఆర్వో తీరుతో మధుయాష్కీకి చెడ్డ పేరు వస్తుందని అంటున్నారు. నిజానికి నియోజకవర్గంలో మధుయాష్కీకి మంచి పేరు ఉంది. హైడ్రా కూల్చివేతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన టార్గెట్ చేశారు. జనం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. నియోజకవర్గ సమస్యలపైనా ఆయన ఫోకస్ చేశారు. అయితే పీఆర్వో దందాలతో మధుయాష్కీ అనవసరంగా బద్నాం అవుతున్నారనే టాక్ వస్తోంది. పీఆర్వో తీరుతో దశాబ్దాలుగా పార్టీ కోసం సేవ చేస్తున్న నేతలకు అన్యాయం జరుగుతుందనే టాక్ వస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా మధుయాష్కీ అప్రమత్తమై పీఏను కంట్రోల్ చేయాలని.. లేదంటే పార్టీతో పాటు ఆయనకు చెడ్డపేరు వస్తుందనే కాంగ్రెస్ కార్యకర్తలు, మధుయాష్కీ అభిమానులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు చదవండి…
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్
ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!
8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్
రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్