
క్రైమ్ మిర్రర్, జగిత్యాల :-
వెల్గటూర్ మండల కేంద్రంలో కోటిలింగాలకు వెళ్ళే రోడ్డు లోని పాత వైన్స్ వెనకాల యువకుడి మృత దేహం లభ్యం…
ఒంటిపై తీవ్ర గాయాలు..??
మరణించిన యువకుడు కిషన్ రావుపేట కు చెందిన సల్లూరి మల్లేష్(35)గా గుర్తింపు…
ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు.
వెల్గటూర్ మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. చల్లారి మల్లేష్ అనే యువకుడిని అడ్డగించి, రాష్ట్ర రహదారి పైన ఉన్న పెద్దవాగు వంతెనపై కొందరు కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన.మృతుడు మల్లేష్ కిషన్ రావుపేట గ్రామానికి చెందిన యువతితో గత సంవత్సరం నుంచి ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కొద్ది రోజుల కిందట కేసులు కూడా నమోదైనట్టు సమాచారం. యువతి కుటుంబ సభ్యులు పలుమార్లు మల్లేష్ను హెచ్చరించినా, ప్రేమ వ్యవహారంలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో గురువారం మల్లేష్ను ప్రేమించిన యువతి బంధువులు అడ్డగించి తీవ్రంగా కొట్టి, అనంతరం పాత వైన్స్ షాప్ వెనక ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులతో పొడిచి హతమార్చినట్లు తెలిసింది. హత్య అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలి వారు పరారైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలిస్తున్నరు.