బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సంచలనం చోటుచేసుకుంది. బాలీవుడ్ గ్రేట్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ను ఎవరో గుర్తు తెలియని దుండగుడు కత్తితో విచక్షణ రహితంగా పొడిచి పారిపోయాడు. ఈ ఘటన తెల్లవారుజామున 2:30 సమయంలో హీరో ఇంట్లోనే జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ దొంగ సైఫ్ అలీ ఖాన్ ను పొడిచిన తర్వాత అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడట. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే దగ్గర్లోని లీలావతి ఆసుపత్రికి తరలించారు.
కాగా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సైఫ్ అలీ ఖాన్ కు సర్జరీ కొనసాగుతుంది. అయితే దాదాపుగా సైఫ్ అలీ ఖాన్ మెడ మరియు వెన్నుముకతో పాటు ఆరు చోట్ల కత్తిపోట్లు పడినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. కాకా బాంద్రా లోని ఫార్చ్యూన్ హైట్స్ 11వ ఫ్లోర్లో సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీతో పాటుగా నివాసం ఉంటున్నాడు.
ఆ దేవుడు రాసినంత కాలమే బ్రతుకుతా: కేజ్రీవాల్
కాకా గుర్తు తెలియని ఆ దొంగ ఇంట్లోకి ప్రవేశించగానే అక్కడున్నటువంటి పని మనుషులు గట్టిగా కేకలు పెట్టగా వెంటనే సైఫ్ అలీ ఖాన్ దొంగ ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ దుండగుడు హీరో పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడని తెలుస్తోంది. కాగా ఈమధ్య బాలీవుడ్లో చాలామంది హీరోలు పై దాడులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంలోనే తాజాగా సైఫ్ అలీఖాన్ పై కూడా దాడి జరగడం అనేది ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.