ఆంధ్ర ప్రదేశ్

పాక్ యుద్దంలో వీర జవాన్ మురళీ నాయక్ కు కన్నీటి వీడ్కోలు

ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ తో యుద్ధం చేస్తూ వీరమరణం పొందిన మురళీ నాయక్ కు అశ్రు నివాళి అర్పించారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొనేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. సత్య సాయి జిల్లా కళ్లి తండాలోని మురళీ నాయక్ వ్యవసా క్షేత్రంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సవితలు మురళీ నాయక్ పార్థీవదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. వీర జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మురళీ నాయక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

మురళీ నాయక్ అంతిమయాత్రలో కల్కితండా జై భారత్, జై జవాన్ నినాదాలతో మార్మోగింది. మురళీ నాయక్ అంతిమయాత్రలో జాతీయ జెండాలు పట్టుకుని పెద్ద ఎత్తు నినాదాలు చేస్తూ యువకులు ముందుకు సాగారు. సరిహద్దులో యుద్దం చేస్తున్న సైనికులకు మద్దతుగా నినాదాలు చేశారు.

ఆర్మీ హెలికాప్టర్ లో బెంగుళూరు చేరిన మురళీనాయక్ పార్థీవదేహాన్ని మంత్రి సవిత దగ్గరుండి రిసీవ్ చేసుకుని రోడ్డు మార్గాన కళ్లి తండాకు తీసుకువచ్చారు. ఈసందర్భంగా మురళీ నాయక్ అమర్ రహే అంటూ అడుగడుగునా జనాలు నీరాజనాలు పలికారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలు వేల సంఖ్యలో రోడ్డు పైకి వచ్చి మురళీ నాయక్ అంతిమ ర్యాలీలో పాల్గొన్నారు. రాత్రి కల్లీ తండాకు చేరుకున్న మురళీ నాయక్ పార్టూవ జిల్లా కలెక్టర్ చేతన్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button