క్రైమ్

సనత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం

  • ఓ ప్లాస్టిక్‌ కంపెనీలో ఫైర్‌ యాక్సిడెంట్‌

  • పేపర్‌ ప్లేట్స్‌ తయారీ కంపెనీలో మంటలు

  • ఆరు ఫైరింజన్లతో మంటలార్పిన సిబ్బంది

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్‌: సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పేపర్‌ ప్లేట్స్‌ తయారు చేస్తున్న డ్యూరోడైన్‌ ఇండస్ట్రీస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఆరు ఫైరింజన్లు, ఒక రోబోట్‌ సాయంతో మంటలార్పారు. కంపెనీలో ప్లాస్టిక్‌ ప్లేట్లు, డిన్నర్‌ సెట్లు, ప్యాకింగ్‌ సామాగ్రి ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారుల ప్రాథమిక అంచనా.

read also:

  1. బీఆర్‌ఎస్‌కు కవిత షాక్‌… బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్‌ఎస్‌ వైఖరిపై గరం గరం
  2. తన సినిమాలలో.. తనకు నచ్చిన మూవీ ఏదో చెప్పేసిన జక్కన్న!
Back to top button