![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/IMG-20250213-WA0015-780x470.jpg?lossy=1&strip=1&webp=1)
చండూరు, క్రైమ్ మిర్రర్ :-మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కన్నకొడుకు లాగా మారి కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..మునుగోడు నియోజకవర్గంలో కంటిచూపుతో బాధపడుతున్న ఏ ఒక్కరు ఇబ్బంది పడొద్దంటూ ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు. ఈ వైద్య శిబిరాలు నిరంతర ప్రక్రియ లాగా కొనసాగిస్తున్నారు.. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ *సామాజిక సేవలో ఉన్న సంతృప్తి దేనిలోను లేదని,
ఆ సంతృప్తి గొప్ప అనుభూతినిస్తుంది అని అన్నారు. జనవరి 19 న మొదటి విడత వైద్య శిబిరానికి అనూహ్యమైన స్పందన వచ్చింది ఆ రోజు 1058 కి వైద్య పరీక్షలు నిర్వహించగా 216 మందికి ఆపరేషన్లు పూర్తి చేశారు… ఆపరేషన్లు చేయించి అలాగే వదిలేయకుండా మరలా వారికి వైద్య పరీక్షలు చేయించి కంటి పనితీరు ను పరిశీలించారు.
రాష్ట్ర ప్రజలు అప్రమత్తం!.. రాష్ట్రంలో మొట్టమొదటిగా మనిషికి బర్డ్ ఫ్లూ కేసు నమోదు!…
ఫిబ్రవరి 9న మరొక 313 మంది కి వైద్య పరీక్షలు నిర్వహించి 108 మందికి కంటి పరీక్షలు చేయించారు..బిజీ షెడ్యూల్ లో కూడా హైదరాబాదులోని శంకర కంటి ఆసుపత్రి లో ఆపరేషన్ చేసిన ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆత్మీయంగా పలకరించి మీకు నేనున్నాను అనే భరోసా కల్పించారు.