Mumbai Crime: ముంబైలోని ఈస్ట్ శాంటాక్రజ్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన ప్రియుడిని ఇంటికి పిలిచి ప్రైవేట్ పార్ట్ ను కట్ చేసింది. న్యూ ఇయర్ రోజున చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
న్యూ ఇయర్ జరుపుకుందామని ఇంటికి పిలిచి..
చాలా మంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తమకు ఇష్టమైన వారితో సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తుంటారు. ఆ మహిళ కూడా తన ఇష్టమైన వ్యక్తితో న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని భావించింది.తన ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ప్రియురాలు పిలవడంతో హ్యాపీగా వెళ్లాడు. అక్కడి వెళ్లాక.. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. ఇదే సమయంలో ఇద్దరూ రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లారు. ప్రియుడి కళ్లకు గంతలు కట్టి.. ప్యాంట్ విప్పాలని కోరింది. అతడు అలాగే చేశాడు. ఇంతలో ఆ మహిళ వంటింట్లోకి వెళ్లి కత్తి తీసుకుని వచ్చి అతని ప్రైవేట్ పార్ట్ ను కోసింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరార్ అయ్యింది. వెంటనే, అతడు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు. స్థానికులు అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మహిళను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆమె ఎందుకు అలా చేసిందంటే?
ఆమె వయసు 25.. అతని వయసు 44.. ఇద్దరికీ పెళ్లైంది. వీరిద్దరికీ పిల్లలు కూడా ఉన్నారు. పైగా వీరు బంధువులు కూడా. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య వివాహేతరం సంబంధం మొదలైంది. ఆరు సంవత్సరాలుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. అతనిపై ఆమె వ్యామోహం మరింత పెరిగింది. దొంగచాటు వ్యవహారాలొద్దు.. ఇక నేరుగా పెళ్లి చేసుకుందామని చెప్పింది. పెళ్లి అనడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అతడు ఒప్పుకోలేదు. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన అతను.. ఆమెను పూర్తిగా దూరం పెట్టాడు. దీంతో రగిలిపోయిన ఆమె.. అతనిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించింది. తనకు దక్కని వాడు.. ఎవరికీ దక్కొద్దని భావించింది. డిసెంబర్ 31న అర్థరాత్రి 1:30 గంటలకు కేక్ కటింగ్ పేరుతో అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది. ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు.. పిల్లలు నిద్రపోతున్నారు. ఆమె ఆహ్వానం మేరకు ప్రియుడికి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఆమె ప్లాన్ ప్రకారం అతని ప్రైవేట్ పార్ట్ ను కట్ చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.





