క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారని టిడిపి ఎంపీ టీజీ భరత్ అన్నారు. అంతేకాకుండా ఎవరికి నచ్చిన, నచ్చకపోయినా ఖచ్చితంగా భవిష్యత్తులో నారా లోకేష్ మాత్రం పక్కా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. తాజాగా స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో జరిగినటువంటి సమావేశాల్లో కొంతమంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కచ్చితంగా కొన్ని దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని, కాబట్టి చంద్రబాబు తర్వాత కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో నారా లోకేష్ ఉంటారని అన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు మంజూరు?..
నారా లోకేష్ మంచి విద్యావంతుడు అంటూ మంత్రి భరత్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలు మరియు 25 మంది ఎంపీలలో స్టాన్ ఫార్డ్ యూనివర్సిటీలో చదివిన ఒకే ఒక్క నాయకుడు లోకేష్ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మొత్తం నారా లోకేష్ అని తెలియజేశారు. కాబట్టి కచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. దీంతో ప్రతి ఒక్కరు కూడా షాకు కు గురయ్యారు. కొంతమంది జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది నారా లోకేష్ కి సపోర్ట్ చేస్తున్నారు. మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.