జనసేనలో కీలకపాత్ర పోషించిన నాగబాబు కు కూటమి ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సీఎం నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. జనసేనలో ముఖ్య ప్రధాన కార్యదర్శిగా ఉంటూ చురుకుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాగబాబుకు, తన కష్టానికి ఎలాగైనా పదవి ఇప్పించాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. ఇక చివరికి సీఎం చంద్రబాబు కూడా నాగబాబు పనితనానికి మెచ్చి మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఒకేసారి నాగబాబుకు మంత్రి పదవితో పాటు రాజ్యసభ సభ్యుల పేర్లను కూడా సీఎం వెల్లడించారు.
నాగబాబుకు ఏ శాఖ కేటాయిస్తారనేది త్వరలోనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక జనసేనలో ఉన్నటువంటి నాగబాబుకు మంత్రి పదవి రావడంతో జనసేన బలం మరింత పెరిగింది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గంలో దాదాపుగా 24 మంది ఉన్నారు. ఇక మిగిలిన ఒక స్థానం జనసేనకు కేటాయించారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే జనసేన తరఫున నాగబాబును మంత్రి గా ఖరారు చేస్తూ టిడిపి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
పట్టణాల నుండి గ్రామాలకు పాకిన సైబర్ స్కామ్స్!… జాగ్రత్త?
ఇక ఇప్పటికే జనసేనలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేష్ మాత్రమే మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. ఇక కూటమి పొత్తు ఒప్పందం ప్రకారం జనసేనకు నాలుగు మంత్రి పదవులు బిజెపికి ఒక మంత్రి పదవి కేటాయించాల్సి ఉండగా తాజాగా ఆ ఖాళీగా ఉన్నటువంటి నాలుగవ మంత్రి స్థానాన్ని నాగబాబుతో భర్తీ చేశారు. ఇక రాజ్యసభ స్థానాల విషయానికి వస్తే టిడిపికి సంబంధించిన బీద మస్తాన్, సానా సతీష్ పేర్లను ఖరారు చేశారని ప్రకటన విడుదల చేశారు.
నా కొడుకు చంపేస్తాడు..కాపాడాలని రేవంత్‌ను వేడుకున్న మోహన్ బాబు