క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రేపు సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీకి వెళ్ళనున్నారు. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు క్యాటగిరిలలో బడ్జెట్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో మరి ముఖ్యంగా ఆంధ్ర రైల్వే బడ్జెట్లో కేంద్రం చాలా ప్రాముఖ్యత ఇచ్చిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవకు ధన్యవాదాలు తెలుపడానికి నారా లోకేష్ ఢిల్లీ వెళ్తున్నట్లుగా సమాచారం అందింది. రేపు సాయంత్రం 5:45 గంటలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తో , నారా లోకేష్ భేటీ కానున్నారు.
కబాలి నిర్మాత ఆత్మహత్య!.. డ్రగ్స్ కేసే కారణముంటున్న బంధువులు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్లో కేటాయింపులపై ధన్యవాదాలు తెలపడంతో పాటుగా పలు ముఖ్య అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం అందింది. నారా లోకేష్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి మళ్లీ విజయవాడకు రానున్నారు. కాగా రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9417 కోట్లు కేటాయించిన విషయం మనం అందరికి తెలిసిందే. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చాలా రాష్ట్రాలకు చాలా వరకు మంచి జరిగిందని అందరూ చర్చించుకుంటున్నారు. గత బడ్జెట్ కన్నా ఈసారి బడ్జెట్ దేశంలో చాలా ప్రాముఖ్యత చూపుతుందని అంటున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర నాయకులు మాత్రం కేంద్రం రాష్ట్రంపై వివక్షత చూపిందని అంటున్నారు.