క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మంత్రి అచ్చం నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాలనలో 5లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచేశాడని, ఆ అప్పులకు కూటమి ప్రభుత్వం నెలకు రూ.22వేల కోట్ల వడ్డీలు కడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క మంత్రి కూడా ఆ మంత్రి పదవికి బాధ్యతగా వ్యవహరించలేదని తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం మా పాలనలో ప్రతి ఒక్క మంత్రి కూడా చాలా బాధ్యతగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ కి గుడ్ న్యూస్!.. కానీ దేశం వదిలి వెళితే కఠిన చర్యలు?
శుక్రవారం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరింగలో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అధక్షతన ఏర్పాటు చేసిన మత్స్యకారుల ఓఎన్‌జీసీ నష్టపరిహారం బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చేసరికి ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని, కేంద్రం సహకారంతో ఆక్సిజన్‌ను పీల్చుకుంటోందని వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీలు అమలుచేశాకే ప్రజల వద్దకు వెళతామన్నారు.
సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు.. రైతు భరోసాకు కొత్త రూల్స్!
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20వేల పరిహారం సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారని, కూటమి ప్రభుత్వానికి మత్స్యకారులంతా అండగా ఉండాలన్నారు. అనంతరం ఓఎన్‌జీసీ అందించిన రూ.148 కోట్ల 37లక్షల 18,500ల చెక్కును అచ్చెన్నాయుడు మత్స్యకారులకు అందించారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఎన్నడూ కూడా అన్యాయం చేయబోదని తెలియజేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే అభివృద్ధి బాటలో ఇచ్చిన హామీలు కూడా ప్రతి ఒక్కరు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
రెండు ఎకరాలతో… దేశంలోనే రిచెస్ట్ సీఎం అయిపోతారా?… రోజా ట్వీట్