
రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:-క్యాతనపల్లిలో పురపాలక ఎన్నికల సందడి మొదలైంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరిపే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ క్రమంలో భాగంగా క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన తాత్కాలిక ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 22 వార్డులు ఉండగా, మొత్తం ఓటర్లు 29,785 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో
పురుషులు: 14,761
మహిళలు: 15,024
థర్డ్ జెండర్: 01
రాజకీయ నాయకుల్లో మొదలైన ఉత్కంఠ
గత పాలకవర్గాల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాది గడుస్తుండటంతో అప్పటి నుంచి మున్సిపాలిటీలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. తాజాగా ఎన్నికల సంకేతాలు రావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐల కు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు టికెట్ల కోసం ప్రయత్నాలను ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. వార్డు స్థాయిలో సమావేశాలు, నాయకులతో సంప్రదింపులు, పార్టీ పెద్దల వద్ద లాబీయింగ్ వంటి కార్యక్రమాలతో క్యాతనపల్లి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. జనవరి రెండో వారంలో వార్డ్ ల రిజర్వేషన్ల జాబితా ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
Read also : క్రికెట్ అభిమానుల డిమాండ్ మేరకు ఆ ప్లేయర్ ను తొలగించాలి అని బీసీసీఐ ఆదేశాలు?
Read also : ఈరోజు బతికున్నాను అంటే దానికి కారణం అంజనేయస్వామీనే : పవన్ కళ్యాణ్





