
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో మదర్స్ డే రోజున ఓ తల్లికి కడుపు కోత మిగిల్చింది. చిన్నారులతో సరదాగా గడుపుతున్న సమయంలో ఏడేళ్ల బాలుడు బియ్యం డబ్బాలు అనుకోకుండా పడి మృతి చెందాడు. ఆడుకోవడానికి వెళ్లిన తమ బిడ్డ ఎంతసేపటికి ఇంటికి రావడం లేదని తెలుసుకున్న తల్లిదండ్రులు… ఆ బాలుడు విగత జీవిగా పడిఉండడాన్ని చూసి విలవిలలాడిపోయారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలోని స్థానిక అరుంధతి కాలనీలో ఉలవపూడి పవన్ మరియు సరస్వతులు నివాసం ఉంటున్నారు. వీరికి వికాస్ మరియు వినయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శుక్రవారం నాడు… తోటి పిల్లలతో సరదాగా ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్న కుమారుడు(7) వినయ్ ఎంతసేపు చూసినా ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆ ప్రాంతం మొత్తం వెతికినా కూడా కనిపించలేదు. దీంతో వెంటనే ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇక పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు మళ్లీ ఆ బాలుడిని వెతకడం ప్రారంభించారు. అలా వెతుకుతున్న సమయంలోనే రాత్రి ఒంటిగంట సమయంలో ఆ బాలుడు తల్లి డాబా పైకి వెళ్ళింది. అక్కడే ఉన్నటువంటి ఖాళీ బియ్యం డబ్బా ఆమే కాలికి గట్టిగా తగలడంతో… వెంటనే ఆ బియ్యం డబ్బా మూత తెరిచింది. ఇక అందులో ఆ చిన్నారి బాలుడు విగత జీవిగా పడి ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా అతని కేకలు వేయడంతో పాటుగా… తల్లడిల్లిపోయింది.
దురదృష్టవశాత్తునే ఆడుకుంటుండగా బాలుడు ఆ బియ్యం డబ్బాలో దాక్కున్న సమయంలో ఆ మూత పడిపోయి లాక్ పడినట్లు గ్రామస్తులు అలాగే పోలీసులు కూడా భావించారు. దీంతో ఊపిరి ఆడకనే ఆ బాలుడు చనిపోయినాడు అని బంధువులు భావిస్తున్నారు. ఏదేమైనా కూడా గ్రామం మొత్తం కూడా ఈ విషయం తెలుసుకున్నాక కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.