
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొడుకు తల్లిని చంపిన ఘటన సంచలనంగా మారింది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 20 ఏళ్ల యువకుడు తన తల్లిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలుగజేస్తుంది. మొబైల్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాడని అతని తండ్రి ఒక మాట అరిచి కొట్టాడు. అయితే ఈ క్రమంలో అతను కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. అయినా మొబైల్ వాడకం మానకపోవడంతో ఆ యువకుడిని తన తల్లి గట్టిగా మందలించింది. దీంతో యువకుడు కోపానికి గురై తల్లిని కొట్టి చంపాడని దర్యాప్తులో తేల్చారు పోలీసులు.
ఇక పోలీసులు తెలిపిన అసలు వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లాకు చెందిన కిషోర్ మరియు ప్రతిభా దంపతుల ఏకైక కుమారుడు సత్యం. సత్యం నీట్ పరీక్ష కోసం నిత్యం చదువుతూనే ఉండేవాడు. అయితే కొద్ది రోజుల నుండి అతను మొబైల్ ఫోన్ అధికంగా ఉపయోగిస్తున్నాడని తల్లిదండ్రులు ఇద్దరు కూడా మందలించారు. ప్రతిక్షణం కూడా మొబైల్ ఫోన్లను వాడడం మానేయమని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇక ఈ పరిస్థితులలో ఆగ్రహానికి గురైన సత్యం అతని తల్లి ప్రతిభను ఇనుప రాడ్డుతో కొట్టాడు. విపరీతంగా రక్తస్రావం అవడంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది. ఇక ఈ తరుణంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రతిభ మరణించింది.
అద్దంకి దయాకర్‌కు మళ్లీ షాక్.. ఎమ్మెల్సీ రేసులో జానారెడ్డి అనుచరుడు?
రాష్ట్రపతి భవన్ లో చండూరు చేనేత కళాకారుల ప్రతిభా ప్రదర్శన!..