జాతీయంతెలంగాణ
Trending

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ థార్ గ్యాంగ్ లీడర్ మహమ్మద్ అస్రఫ్ ఖాన్ అరెస్ట్!..

నల్గొండ, క్రైమ్ మిర్రర్ :- నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయివేట్ ట్రావెల్ బస్ లో నుంచి 25 లక్షల రూపాయలు దొంగలించి పారిపోయిన ధార్ గ్యాంగ్ చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహమ్మద్ అస్రఫ్ ఖాన్ ను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అరెస్టు చేయడం జరిగింది. తేదీ 09-02-2025 నాడు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే శ్యామ్ సర్దార్ ట్రావెలింగ్ బస్సులో ప్రయాణిస్తున్న నెల్లూరుకు చెందిన బోయిన వెంకటేశ్వర్లు హైదరాబాద్ లోని మౌరీ టెక్ సంస్థ యజమాని దామోదర్ రెడ్డి కు సంబంధించి వ్యవసాయ భూమిని అమ్మగా వచ్చిన 25 లక్షల రూపాయలను హైదరాబాద్ తీసుకెళ్తున్నాడు. ఇట్టి బస్ నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ పూజిత హోటల్ వద్ద ఉదయం 9 గంటలకి అల్పాహారాం కొరకు ఆపగా, కిందికి దిగి మూత్ర విసర్జన చేసి వచ్చేవరకు తన బ్యాగులో ఉన్న 25 లక్షల రూపాయలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిచారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిఐ నార్కట్ పల్లి ఆధ్వర్యంలో నాలుగు బృందాలు సిసియస్ నల్గొండ రెండు బృందాలను ఏర్పాటు చేసి పూజిత హోటల్ నందు సీసీ కెమెరాలు పరిశీలించగా ఒక మారుతి సుజుకి ఫ్రాంక్స్ వెహికల్ లో నలుగురు వ్యక్తులు వచ్చి ఒక వ్యక్తి బస్సులోకి ఎక్కి బ్యాగును తీసుకొని కిందికి వచ్చి కారులో హైదరాబాదు వైపు వెళ్తున్నట్టుగా గుర్తించడం జరిగింది.

ఇకపై అసభ్యకరమైన సినిమాలు చేయను : హీరో విశ్వక్ సేన్

ఈ సీసీ కెమెరాలు ఆధారంగా నలుగురు వ్యక్తుల ఫోటోలని గుర్తించి అన్ని క్రైమ్ టీంలకు పంపగా పాత నేరస్థుల ఫొటోలతో సరి పోల్చగా వీరు మద్యేప్రదేశ్ చెందిన థార్ గ్యాంగ్ గా CCS పోలీస్ లు గుర్తించి, సిసియస్ సీఐ జితేందర్ రెడ్డి యస్. ఐ వెంకట్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధనగిరి, రబ్బాని, పుష్పగిరి,సత్యనారాయణ లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాలో మనవార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక ప్రధాన నిందితుని పట్టుబడి చేసి ఇతని వద్ద నుండి 25 లక్షలు రూపాయలు, ఒక కారు, స్వాధీనం చేసుకొని అక్కడి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈరోజు నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి విచారించగా..
నిందితుల వివరాలు..
1.మహమ్మద్ అస్రఫ్ ఖాన్ ముల్తాని షేక్ తండ్రి హాజీ రోషన్ ఖాన్, వయస్సు 42 సంవత్సరాలు, కులం ముస్లిం, వృతి వ్యవసాయం/కూలీ, నివాసం రాళ్లమండల్ H/o కేద్వా జాగీర్, మన్వర్ తాలూకా, బార్ డిస్ట్రిక్ట్, మధ్యప్రదేశ్ రాష్ట్రం.
2 లైబ్ ఖాన్ తండ్రి సిరాజ్ (పరారీలో)
3.అక్రమ్ ఖాన్ తండ్రి జుమ్మ (పరారీలో)
4.మహబుబ్ ఖాన్ తండ్రి శంశేరు (పరారీలో)
పైన తెల్పిన నిందితులు విలాసాలకు అలవాటు పడి అక్రమ మార్గం లో డబ్బులు సంపాదించాలని దొంగతనాలు చేయడం మొదలుపెట్టి ఇలా స్వంత రాష్ట్రం లో అనేక దొంగతనాల చేసి జైలుకు వెళ్లడం జరిగింది. స్వంత రాష్ట్రంలో దొంగతనాలు చేస్తూ పోలీసులు ప్రతిసారి పట్టుబడి చేసి జైల్ కు పంపుతుండటం తో అక్కడ కాకుండా వేరే రాష్ట్రాలలో దొంగతనాలు చేస్తే పోలీసులు పట్టుకోలేరు అని నిర్ణయించుకున్నారు.ఇట్టి దొంగతనాలలో భాగంగా హైవే రోడ్ల వెంబటి ప్రయాణిస్తూ రోడ్డు పక్కన ఉండే పెద్ద పెద్ద హోటల్స్ దగ్గర ఆగి అక్కడికి వచ్చే ట్రావెల్స్ బస్ లను గమనిస్తూ బస్ లోని ప్రయాణికులు టిఫిన్ చేయడానికి బస్ దిగగానే బస్సులోకి వెక్కి తనికి చేసి దొంగతనలు చేస్తారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి పొంగిలేటి సెటైర్లు!..

తేదీ 09.02.2025 రోజున నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో హైవే పక్కన ఉన్న పూజిత హోటల్ వద్దకు ఉదయం 9.00 గంటల సమయం లో ప్రైవేట్ ట్రావెల్ బస్ రాగ అట్టి బస్ లోని ప్రయాణికులు తమ లగేజ్ ను బస్ లోనే ఉంచి టిఫిన్ కోసం బస్ దిగడం గమనించి. బస్ లో ఉన్న బ్యాగ్ లను తనిఖీ చేయగా అందులో డబ్బులు ఉండడం గమనించి వెంటనే అట్టి బ్యాగ్ లోని డబ్బును వీరి బ్యాగ్ లో వేసుకొని దిగి కారులో హైద్రాబాద్ మీదిగా మధ్య ప్రదేశ్ లో వారి స్వగ్రామాని వెళ్ళగా ప్రత్యేక బృందాల ద్వారా అక్కడికి వెళ్లి అక్కడి పోలీస్ అధికారుల సహకారంతో పట్టుబడి చేసి 25 లక్షలు రూపాయలు,ఒక కారు,స్వాధీనం చేసుకొని నేడు వారిని అరెస్టు చేసి కోర్ట్ లో హాజరు పరచడం జరిగింది.గతంలో నిందితుడు అష్రఫ్‌ పై పూణే (మహారాష్ట్ర) మరియు ఇండోర్ జిల్లాలోని సిమ్రోల్ పోలీస్ స్టేషన్‌లో దొంగతనానికి సంబంధించిన నేరాలు మరియు మనవార్ పోలీస్ స్టేషన్‌లో దాడికి సంబంధించిన నేరాలు నమోదయ్యాయి. సుళ్ళూరు పేట,నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేసులు నమోదు అయ్యీయి.ఇంకా పరారి లో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలో పట్టుకోవడం జరుగుతుంది.ఇట్టి కేసును నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి గారి పర్యవేక్షణలో ఛేదించిన సి.సి.యస్ సిఐ జితేందర్ రెడ్డి,నార్కట్ పల్లి సిఐ నాగరాజు,యస్.ఐలు క్రాంతి కుమార్, వెంకట్ రెడ్డి CCS హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధనగిరి, రబ్బాని, పుష్పగిరి, కానిస్టేబుల్ సత్యనారాయణ గార్లను జిల్లా ఎస్పి గారు అభినందిచి రివార్డ్ ప్రకటించారు.

జగన్, కొడాలి నానిపై కేసు.. వైసీపీలో టెన్షన్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button