
Kangana Ranaut On Jaya Bachchan: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌పై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని బచ్చన్ తోసేస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కంగనా ఆమెపై మండిపడ్డారు. ఆమె బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను సహిస్తున్నారని వ్యాఖ్యానించారు.
సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిని తోసేసిన జయా బచ్చన్
తాజాగా సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిని కోపంగా తోసేశారు జయా బచ్చన్. ‘ఏం చేస్తున్నావ్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు వ్యక్తి సారీ చేప్పారు. దేశ రాజధాని ఢిల్లీ లోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆవరణలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ అనూహ్య పరిణామానికి అక్కడున్నవారంతా షాకయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్ హల్ చల్ చేసింది. ఆ వీడియోపై కంగన స్పందిస్తూ విమర్శలు చేశారు. ఈ ఘటనను అవమానకరంగా, సిగ్గు చేటుగా అభివర్ణించారు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. అటు సింపుల్‌గా సెల్ఫీ వద్దు అంటే సరిపోయేది, అతడిని చేత్తో నెట్టివేయడం దారుణం అంటున్నారు నెటిజన్లు. కొంతమంది యాటిట్యూడ్ అంటూ జయాబచ్చన్‌ను విమర్శిస్తున్నారు. మరి కొందరు జయ ప్రవర్తనను సమర్థించారు.
Read Also: గాజాపై వ్యాఖ్యలు.. ప్రియాంక గాంధీపై ఇజ్రాయెల్ ఆగ్రహం!