ఆంధ్ర ప్రదేశ్

ఏపీ మద్యం కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ కాలిగూటికి కూడా సరిపోదు: లావు శ్రీకృష్ణదేవరాయలు

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఢిల్లీ మద్యం కుంభకోణం కన్నా ఆంధ్రప్రదేశ్ లోనే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని టిడిపి నేత లావు శ్రీకృష్ణదేవరాయలు లోకసభలో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి అయినటువంటి అమిత్ షా దృష్టి పెట్టారు. మంగళవారం నాడు పార్లమెంటు సమావేశాల మధ్యలోనే లావు శ్రీ కృష్ణదేవరాయలును, హోం మంత్రి అమిత్ షా తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. అక్కడ వైఎస్ఆర్సిపి చేసిన అక్రమ మద్యం కుంభకోణాల వివరాలను తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ కుంభకోణం నీటి బొట్టు అంతేనని ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయనకు వివరించారు. వాటికి సంబంధించిన కీలక పత్రాలను అమిత్ షాకు అందజేశారు.

దాదాపు 90 వేల కోట్ల మద్యం వ్యాపారంలో 18 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని… అంతేకాకుండా మరో నాలుగు వేల కోట్ల బినామీ పేర్లతో దుబాయ్ మరియు ఆఫ్రికాలకు తరలించారు అన్న ఆరోపణలపై హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. హైదరాబాద్ కు చెందిన సునీల్ రెడ్డి 2000 కోట్లను దుబాయ్ కు తరలించిన కీలక పత్రాలను శ్రీకృష్ణదేవరాయులు,అమిత్ షాకు అందజేశారు. ఇక వెంటనే అమిత్ షా ఈ విషయంపై దర్యాప్తు జరిపిస్తామని లావు శ్రీకృష్ణదేవరాయలకు మాటిచ్చారు. ఏపీ మద్యం కుంభకోణం పర్యవసనాల వల్లే ఒక ఎంపీ రాజీనామా చేసి… రాజకీయాల నుంచి నిష్క్రమించారని కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. అర్థంపర్థం లేని 26 కొత్త కంపెనీలను ప్రారంభించి, అంతర్జాతీయ బ్రాండ్లన్నింటిని కూడా ఏపీ నుంచి వెళ్లగొట్టారని తెలిపారు.

కొడాలి నానికి గుండెపోటు – బైపాస్‌ చేయాలంటున్న వైద్యులు

టెన్త్ పరీక్షా పేపర్ లీక్.. సైలెంట్ గా ఉండాలని డీఈవోకు వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button