
తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్నఇందిరమ్మ పథకం ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రేవంత్ సర్కార్ కు షాక్ ఇచ్చింది కేంద్రం. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. తాము రూపొందించిన యాప్ లోనే సర్వే చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రీ-సర్వే చేయమని కోరింది కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామసభల ద్వారా దరఖాస్తులు సేకరించింది. ప్రజా పాలనలో ఒక సారి.. రెండు నెలల క్రితం గ్రామ సభల ద్వారా మరోసారి దరఖాస్తులు తీసుకున్నారు. తాము రూపొందించిన ఇందిరమ్మ యాప్ లో వివరాలు పొందు పరిచారు. అయితే తాము రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా సర్వే చేస్తేనే నిధులు ఇస్తామని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే జనాల్లో నమ్మకం కోల్పోతున్నామని, మళ్ళీ అన్ని లక్షల మందికి రీ-సర్వే చేయాలంటే ప్రజల్లో మాపై నమ్మకం పూర్తిగా పోతుందని వాపోయిన రాష్ట్ర ప్రభుత్వం.
మోడీ సర్కార్ నిర్ణయంతో ఇందిరమ్మ ఇళ్ల భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపైన పడనుంది. కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తాము అన్ని ఇందిరమ్మ ఇళ్లు ఎలా కట్టాలని అయోమయంలో పడ్డ రేవంత్ సర్కార్. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్షల ఇండ్లు ఎలా కట్టాలనే ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.