క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠంగా మారిపోయింది. ఇక్కడ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఒకవైపు కూటమి, మరోవైపు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయితే ఇక ఈ నేపథ్యంలోనే వైసిపి పార్టీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని కొంతమంది టిడిపి నేతలు కిడ్నాప్ చేశారని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని ఆయన నివాసం నుంచి ఎక్కడకు తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. కాగా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా
ఎమ్మెల్సీ కిడ్నాప్ అవ్వడం అనేది సంచలనంగా మారింది. కాగా ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్న సిపాయి సుబ్రహ్మణ్యం ఓటు ఇక్కడ కీలకం కానుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం సంచలనగా మారింది.
ఇవి కూడా చదవండి
1.రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న నారా లోకేష్ !… కారణమేంటంటే?