తెలంగాణ

రేవంత్ రెడ్డి రూ. 20 వేల కోట్ల స్కాం! ఆధారాలు బయటపెట్టిన కవిత

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. టీజీఐఐసీ పరిధిలో లక్షా 75 వేల ఎకరాలను తాకట్టు పెట్టేలా రేవంత్ రెడ్డి కుట్రపూరిత స్కెచ్ వేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు కవిత. టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసిందని తెలిపారు. కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉందన్నారు.

తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువపెట్టే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారని.. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని కవిత ప్రశ్నించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్ లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ? స్టాక్ ఎక్సేంజ్ లో నష్టం జరిగితే తెలంగాణలో జమా చేసుకున్న భూముల భవితవ్యం ఏమిటిని కవిత నిలదీశారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు కవిత. టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గత 16 నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రూ 1.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని కవిత చెప్పారు. తెచ్చిన అప్పులతో ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు, అభివృద్ధికి వెచ్చించలేదని..తులం బంగారం ఇవ్వలేదు, మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు. గతంలో చేసిన అప్పులకు కేవలం 80 వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం తిరిగి చెల్లించిందని..
మిగిలిన లక్ష కోట్లు ఎక్కడికి వెళ్లాయని ధ్వజమెత్తారు. లక్ష కోట్లను పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించారని.. అందులో 20 శాతంగా 20 వేల కోట్ల రూపాయలు.. కాంట్రాక్టర్ల నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నీచమైన మాటలు మాట్లాడుతున్నారని కవిత మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button