
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను తాజాగా ఎత్తివేయడం జరిగింది. ఉమ్మడి గుంటూరు మరియు కృష్ణ, ఉపయోగ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అలాగే ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు నేడు విడుదల అయిన సందర్భంగా ఎన్నికల కోడ్ ను ఎత్తివేయడం జరిగింది. ఈ మేరకు ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ప్రకటనల ద్వారా తెలియజేశారు. దీంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణ, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం మరియు అనకాపల్లి జిల్లాలలో ఎన్నికల కోడ్ ఆంక్షలను ఎత్తివేయునన్నారు.
పవన్, లోకేష్ కంటే పోసాని ఎక్కువగా బూతులు తిట్టారా?: అంబటి రాంబాబు
కాగా గత నెల మూడవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని పలు జిల్లాలలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వారిని మంత్రి నారా లోకేష్ తాజాగా అభినందించారు. ఆలపాటి రాజేంద్ర, వీరభత్తుల రాజశేఖర్ ను మంగళగిరిలోని టిడిపి ఆఫీసులో మంత్రి నారా లోకేష్ ను కలిచారు. నారా లోకేష్ వాళ్ళందరినీ హత్తుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయంతో మనపై ప్రజల నుండి మరింత బాధ్యత పెరుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలోని యువత మనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరు పని చేయాలని అన్నారు. ఇక ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పనకు పోవడం ప్రభుత్వం కట్టుబడి ఉంది అని నారా లోకేష్ మరోసారి తెలియజేశారు.
నితిన్ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్!.. అసలు తగ్గేదేలే..
మోడీని వదిలేసి కిషన్‌రెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్‌రెడ్డి- దీని వెనుక అసలు కథేంటి…?