
హైదరాబాద్ పాతబస్తీలో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే రాజాసింగ్ చేపట్టిన జైశ్రీరామ్ శోభోయాత్రకు భారీగా ఏర్పాట్లు చేశారు.మంగళ్ హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభం కానుంది శ్రీరామ నవమి శోభాయాత్ర. మధ్యాహ్నం 1గంటకు ర్యాలీగా బయలుదేరనున్న శోభాయాత్ర.. సీతారాం భాగ్ నుండి ప్రారంభం అయి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయమశాలకు చేరుకోనుంది. మొత్తం 3.8 కిలో మీటర్ వరకు సాగనుంది శోభాయాత్ర.ఈ యాత్రను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించే అవకాశం వుంది. ధూల్‌పేట మాగ్రా నుంచి శ్రీరామ నవమి పాల్కీ యాత్ర జరుగనుంది. పాల్కీ యాత్రను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించే అవకాశం వుంది. ధూల్‌పేట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర కొనసాగుతుంది.
Also Read : సన్నబియ్యం పేదవాడి ఆత్మ గౌరవం..మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ లో జరుగనున్న శోభాయాత్ర కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. సీతారామ్‌బాగ్ నుంచి యాత్ర కొనసాగే హనుమాన్ టేక్డీ వరకు 20 వేల మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అడుగడుగున సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశారు. జాయింట్ కంట్రోల్ రూమ్ & బంజారాహిల్స్ మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా శోభ యాత్ర పర్యవేక్షణ సాగనుంది. రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీం, సిటీ టాస్క్ ఫోర్స్, షీ టీమ్స్ మఫ్టీ క్రైమ్ పార్టీ పోలీసులతో భద్రత కల్పించారు.
Also Read : తెలంగాణ లేటెస్ట్ సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!
శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ శోభాయాత్ర జరుగనుంది. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. చిన్న ఊరేగింపులు అనుసంధానం అయ్యే కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. మతపరమైన ప్రదేశాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలలో అదనపు బలగాలను మెహరించనున్నారు. ఈ సందర్భంగా కల్లు, మద్యం దుకాణాలు బంద్ చేయాలని కమిషనర్ ఆదేశించారు.