
Komatireddy Rajagopal Reddy Shocking Comments: కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన సోదురుడు, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒకరికొకరు పూర్తి భిన్న ధృవాలుగా మారిపోయారు. అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాజిటివ్ గా మాట్లాడుతుంటే, తమ్ముడు ఒంటికాలి మీద లేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం మరోసారి పదవీ త్యాగానికైనా రెడీ అని బాంబు పేల్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మ గూడెం గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభోత్సవంలో పాల్గొన్నరాజగోపాల్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్ లోకి వచ్చా!
మంత్రి పదవి ఇస్తానంటేనే హామీ ఇస్తేనే, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చానని రాజగోపాల్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి తనను దూరం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని.. తనకు మంత్రిపదవి ఇస్తారా? లేదా? అనేది పార్టీ ఇష్టమన్నారు. అందరిలా పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం తనది కాదన్నారు. ఇకపై తాను ఎంత దూరమైనా వెళ్తానని తేల్చి చెప్పారు. మనసు చంపుకుని బతకడం తన వల్ల కాదన్నారు. పదవుల కోసం కోసం పాకులాడనన్నారు. తనలాంటి వాడికి మంత్రి పదవి వస్తే ప్రజలకే మేలు జరుగుతుందన్నారు. మునుగోడు ప్రజల సంక్షేమం కోసం అవసవరమైతే రాజీనామాకు సిద్ధమేనని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు.
Read Also: అరెస్ట్ చేసినా భయపడేది లేదన్న కేసీఆర్ – కాళేశ్వరంపై నెక్ట్స్ స్టెప్ ఏంటి?