
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు పక్కా బిఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నే అంటూ మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పారణగర్ డంప్ యాడ్ జేఏసీ బాధితులు ఎమ్మెల్యే మహిపల్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. డంప్ యార్డ్ విషయంలో ప్రభుత్వం పార్టీ ఎమ్మెల్యే మీరు అని డంప్ యార్డు బాధితులు అడగగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లవడా లో పార్టీ అంటూ దూషించారు డంపు యాడ్ ఇష్యూ గత 26 రోజులు జరుగుతుంది ఇప్పుడు మీకు గుర్తొచ్చానా అంటూ వారిపై వ్యక్తం చేశాడు. తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను కాదా.. తాను పక్కా బీఆర్ఎస్ పార్టీ వాడినని చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి.. కొన్ని రోజులకే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచే ఆయన వివాదాలకు కేరాఫ్ గా మారారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ తో ఆయన వార్ సాగుతోంది. ఇద్దరు బహిరంగంగానే సవాళ్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గూడం క్యాంప్ కార్యాలయంపై కాట వర్గీయులు దాడి చేశారు. ఈ సందర్భంగా కాట మనుషులు మహిపాల్ రెడ్డి కార్యాలయంలో ఉన్న కేసీఆర్ ఫోటోను తీసుకొచ్చి పగలగొట్టారు. ఈ ఘటనపై స్పందించిన మహిపాల్ రెడ్డి.. కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. తన కార్యాలయంలో కేసీఆర్ ఫోటో బరాబర్ పెడతానని చెప్పారు. నా ఇంట్లో కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలో.. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలో అన్నది తన ఇష్టమని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి…
-
టీడీపీ-జనసేన మధ్య గ్యాప్ వస్తోందా..? – అందుకు కారణం నాగబాబేనా..!
-
కిషన్‌రెడ్డి – బండి సంజయ్ మధ్య క్రెడిట్ వార్ – ఎమ్మెల్సీల విజయం వెనుక ఎవరి పాత్ర ఎంత?
-
మోడీని వదిలేసి కిషన్‌రెడ్డిని టార్గెట్ చేసిన రేవంత్‌రెడ్డి- దీని వెనుక అసలు కథేంటి…?
-
వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు?
-
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్‌ఎస్ పోటీ – ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా కేసీఆర్ వ్యూహం