
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. మంత్రులను టార్గెట్ చేస్తూ ఓపెన్ గానే ప్రకటనలు చేస్తున్నారు. జంపింగ్ ఎమ్మెల్యేలు కూడా దూకుడు పెంచుతున్నారు. కొన్ని రోజులుగా తన కామెంట్లతో కాక రేపుతున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి బాంబ్ పేల్చారు. రేవంత్ సర్కార్ ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడారు.
కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేస్తుంటే ప్రజలు తులం బంగారం అడుగుతున్నారని దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ ఎన్నికలు హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. తులం బంగారం విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతా, తులం బంగారం వచ్చేలా చేస్తానని ప్రకటించారు. తాను ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటానన్నారు దానం నాగేందర్. హైడ్రా ప్రజలను ఇబ్బంది పెడితే తాను ప్రజల వైపు ఉన్నానని తెలిపారు. 50, 80 గజల్లో పేదలు ఇళ్ళు కట్టుకుంటే వారి ఇబ్బంది పెట్టవద్దని తహసీల్దార్లను హెచ్చరించారు ఎమ్మెల్యే దానం నాగేందర్.