
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- పవన్ కళ్యాణ్ హీరోగా ఈనెల 24వ తారీఖున “హరిహర వీరమల్లు” సినిమా చాలా ఘనంగా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాను జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తుండగా పవన్ కళ్యాణ్ హీరో, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఈ నెల 21వ తారీఖున హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరుగుతుంది. ఇందులో విశేషం ఏమనగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల నుంచి మంత్రులు రాబోతున్నారట. ఇందులో ముఖ్యంగా సినిమా ఆటోగ్రఫీ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ హాజరుకానున్నారట. ఇక వేళ్ళతో పాటుగా డైరెక్టర్ త్రివిక్రమ్ అలాగే పలువురు ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లో నేలకున్నవేళ హరిహర వీరమల్లు అనే సినిమాతో మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులను ఫుల్ జోష్లో ఉండేలా చేశారు. ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వంలో భాగంగా గెలుపొందిన తరువాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా బాధ్యతలు కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాలను ఆపివేశారు. అయితే ఇందులో ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా ఇక వెంటనే ఈ నెల 24వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా ఉండడంతో… తోటి రాజకీయ నాయకులు కూడా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఒక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రావడం ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. కాబట్టి ఈ హరిహర వీరమల్లు సినిమా అనేది ఒక రికార్డు సృష్టిస్తుందని చెప్పాలి. కాగా ఈ సినిమా కోసం ఎంతోమంది జనసేన అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.