ఆంధ్ర ప్రదేశ్

జగన్ ప్రవేశపెట్టబోతున్న యాప్ పై.. మంత్రి సత్య కుమార్ యాదవ్ సెటైర్స్!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మంత్రి సత్య కుమార్ యాదవ్ సెటైర్ల వర్షం కురిపించారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం వైసీపీ పార్టీ తరఫున ఒక యాప్ తీసుకొస్తామని చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ యాప్ లో ఎవరైనా సరే కూటమి నాయకులు వేధించిన లేదా తప్పుడు కేసులు పెట్టినా, అది కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా లేదా అధికారైన సరే… వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వెంటనే ఆ యాప్ లో వారికి సంబంధించి వివరాలను నమోదు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో మన అధికారం వచ్చిన తరువాత.. ఈ ఫిర్యాదులు అన్నింటిని కూడా నేను పరిశీలించి వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంపై మంత్రి సత్య కుమార్ యాదవ్ సెటైరికల్ ట్వీట్ చేశారు.
నెమ్మదిగా పెరుగుతున్న వరద.. నదిలో ప్రయాణించవద్దని హెచ్చరికలు!

అన్నా పోలీసులు పట్టుకున్నారు.. కాపాడన్న
నువ్వేం కంగారు పడకు…

1. ఫోన్ తీసుకో
2. ప్లే స్టోర్ ఓపెన్ చెయ్
3. రప్పా రప్పా యాప్ డౌన్లోడ్ చేసుకో
4. లాగిన్ అవ్వు
5. ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చెయ్
6. అక్కడ 11 పేజీల ఫామ్ ఉంటుంది.
7. చక్కటి చిరునవ్వుతో ఫిల్ చెయ్
8. లాస్ట్ లో వై నాట్ 175 అనే బటన్ మీద క్లిక్ చెయ్
9. నాలుగేళ్లు కళ్ళు మూసుకో… అందరికీ సినిమా చూపిద్దాం ఓకేనా అని మెసేజ్ వస్తుంది.
10. కింద సిద్ధం బటన్ మీద క్లిక్ చెయ్
11. అంతే ఇంకా అంత దేవుడే చూసుకుంటాడు.
అంటూ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఒక ఫోటోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఇది బాగా చక్కెరలు కొడుతున్న సందర్భంగా షేర్ చేస్తున్నానని… మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
జడ్చర్లలో 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం – ఐదుగురు బాలురపై కేసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button