
తెలంగాణలో ప్రస్తుతం LRS అమలవుతోంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి క్లియర్ చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ పై రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. LRS స్కీమ్ మార్చ్ 31 వరకు గడువు ఉంది. ఆ లోగా చేసిన వారికి 25 శాతం డీస్కౌంట్ ఇస్తున్నామని చెప్పారు. LRS ఇప్పుడు కాకుండా ఇళ్ళు కట్టేటప్పుడు పర్మిషన్ కావాలన్నప్పుడు 100 శాతం LRS కట్టాల్సి ఉంటుందన్నారు. త్వరలో భూ వాల్యూ పెంచబోతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.
త్వరలో భూ సర్వే కోసం ప్రతీ మండలానికి సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్ ను నియమిస్తామన్నారు మంత్రి పొంగులేటి. అలాగే లైసెన్డ్ సర్వేయర్ లకు అవకాశం ఇస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది లైసెన్డ్ సర్వేయర్లకు అవకాశం ఇస్తామని.. వీళ్లందరికి ట్రయినింగ్ ఇస్తామన్నారు.కేంద్రం ప్రధాని అవాస్ యోజన కింద అర్బన్ ఏరియాలో 1 లక్ష 13 వేల ఇళ్లను మంజూరు చేసిందన్నారు పొంగులేటి. అర్బన్ ఏరియాలో కట్టే ఇళ్ల కు కేంద్రం 1.50 లక్షలు మాత్రమే కేంద్రం ఇస్తుందని.. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. రూరల్ ఏరియాకు సంబందించి కేంద్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదన్నాపు.
Also Read : పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!.. తమిళ ప్రజలు కోరుకుంటే కచ్చితంగా పార్టీని స్థాపిస్తా?
సాదాబైనామ ల విషయంలో కొత్త దరఖాస్తు లను స్వీకరించబోమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. పాత దరఖాస్తులలో 13 లక్షల దరఖాస్తు లను గత ప్రభుత్వం రిజక్ట్ చేసిందని గుర్తు చేశారు. రిజెక్ట్ చేసిన వారికి అపిలేట్ అధారిటిలో ఆపిల్ చేసుకోవచ్చన్నారు. తనకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మధ్య ఎలాంటి సమస్య లేదని మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. తనకు ఏ ఎమ్మెల్యేతో సమస్య లేదన్నారు. ఎమ్మెల్యే అనిరుద్ చెబుతున్న అభిమన్యు రెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.