Homeఆంధ్ర ప్రదేశ్డయోరియా బాధితులను పరామర్శంచిన మంత్రి నారాయణ

డయోరియా బాధితులను పరామర్శంచిన మంత్రి నారాయణ

శ్రీకాకుళం, క్రైమ్ మిర్ర‌ర్: డయేరియా బాధితులను మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయణ గురువారం డయేరియా తో మృతి చెందిన మండల సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా తమ పిల్లలకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని సురేష్ కుటుంబసభ్యులు ఆయ‌న‌ను కోరారు.

తరువాత మంత్రి డయేరియా ప్రబలిన ప్రాంతాలను పరిశీలించారు. ప్రభుత్వ వైద్య కళాశాల, కిమ్స్ లో బాధితుల ను పరామర్శించారు. అనంత‌రం మున్సిప‌ల్ కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ డయేరియా పై జిల్లా యంత్రంగం వెంటనే అప్రమత్తమయింది.

102 కేసులు నాలుగు సచివాలయాల పరిధిలో నమోదయ్యాయి . 13 మంది డిశ్చార్జ్ అయ్యారు. 85 మంది ఆస్పత్రిలో ఉన్నారు. ఇద్దరు కిడ్ని సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 45 మందిని ఇప్పుడు వెంటనే డిచ్ఛార్జ్ చేయవచ్చు కానీ అబ్జర్వేషన్ కోసం ఆసుపత్రి లోనే ఉంచాం. 50 టీం లతో డోర్ టు డోర్ సర్వే చేసాం. ఓకరు డయేరియా మృతి చెందిన‌ట్లుగా గుర్తించామని అన్నారు. ఆయ‌న వెంట ఎమ్మెల్యే గొండు శంక‌ర్‌, క‌లెక్ట‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్‌, అధికారులు ఉన్నారు.

తాజావార్తలు