
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు గట్టి ఎదురుదెబ్బ తగిలించింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయనున్నారు. ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కొండాపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ తో పాటు నటి సమంత విడాకుల వ్యవహారంపై కొండా సురేఖ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై కేటీఆర్ సీరియస్ అయ్యారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. తాజాగా న్యాయస్థానం మంత్రి కొండాపై క్రిమినల్ కేసు నమోదు చేశాలని పోలీసులను ఆదేశించింది.
ఆగష్టు 21 లోగా కేసు నమోదు చేయాలన్న న్యాయస్థానం
ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించిన నేపథ్యంలో నిందితురాలు కొండా సురేఖపై ఈ నెల 21 లోగా క్రిమినల్ కేసు నమోదు చేసి ఆమెకు నోటీసు జారీ చేయాలని న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని కేటీఆర్ న్యాయవాది వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఫిర్యాదుతో పాటు సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత, నిందితురాలు కొండా సురేఖపై ప్రాథమిక కేసు ఉన్నట్లు నాంపల్లి కోర్టు నిర్ధారించింది. అనంతరం ఆమెపై క్రిమినల్ చేసు నమోదుకు ఆదేశించింది.
స్పందించిన కొండా సురేఖ
కోర్టు తీర్పుపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తనకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉందన్న ఆమె.. కేసులు, కొట్లాటలు తనకు కొత్త కాదన్నారు. తన జీవితమే ఒక పోరాటమన్నారు. ఏ కేసులో అయినా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం కామన్ అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
Read Also: 15 ఏళ్లు.. 8 పెళ్లిళ్లు.. తొమ్మిదో పెళ్లి చేసుకుంటుండగా..