Mexico Tariffs On India: అమెరికా.. భారత్ పై 50 శాతం టారిఫ్ విధించగా, ఇప్పుడు అదే బాటలో మెక్సికో చేరింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం టారీఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆటో పార్ట్స్, లైటర్ కార్స్, బొమ్మలు, బట్టలు, టెక్స్ టైల్స్, ప్లాస్టిక్స్, ఫర్నిచర్, ఫుట్ వేర్, స్టీల్, హౌస్ హోల్డ్ అప్లయెన్సెస్, లెథర్ గూడ్స్, అల్యూమినియం, పేపర్, గ్లాస్, సోప్స్, కార్డ్ బోర్డ్, మోటార్ సైకిల్స్, పర్ ఫ్యూమ్స్, కాస్మెటిక్స్ తో పాటు మరికొన్ని వస్తువులపై మెక్సికో ప్రభుత్వం 50 శాతం టారీఫ్ విధించింది. మెక్సికో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా భారత ఎగుమతిదారులపై తీవ్ర ప్రభావం పడనుంది.
మెక్సికోపై భారత్ తీవ్ర అసంతృప్తి
మెక్సికో నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మెక్సికో నిర్ణయంపై భారత్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత ఎగుమతిదారుల బాగుకోసం తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అదే సమయంలో మెక్సికోతో చర్చలు జరుపుతామని ప్రకటించింది. బిల్లు పాస్ అవ్వడానికి ముందు కూడా భారత్, మెక్సికోతో చర్చలు జరిపింది. ఇప్పుడు కూడా రెండు దేశాలకు లాభం చేకూరేలా సమస్య పరిష్కారం కోసం ది డిపార్ట్ మెంట్ ఆఫ్ కామర్స్.. మెక్సికో మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీతో చర్చలు జరుపుతోంది. కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్.. మెక్సికో వైస్ మినిస్టర్ ఆఫ్ ఎకానమీ లూయిస్ రొసెండోల మధ్య హై లెవెల్ మీటింగ్ జరిగింది. మరికొన్ని మీటింగ్స్ కూడా జరిగే అవకాశం ఉంది.
జనవరి 1 నుంచి కొత్త టారిఫ్ లు అమలు
అటు మెక్సికో తీసుకున్న 50 శాతం టారీఫ్‌ల నిర్ణయం 2026, జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తమతో ట్రేడ్ డీల్స్ చేసుకోని దేశాలపై మెక్సికో 50 శాతం టారీఫ్‌లు విధించింది. ఇండియాతో పాటు సౌత్ కొరియా, చైనా, థాయ్‌లాండ్, ఇండోనేషియా దేశాలపై కూడా 50 శాతం టారీఫ్‌లు విధించింది. అమెరికా ఒత్తిడి కారణంగానే మెక్సికో, ఇండియాపై 50 శాతం టారీఫ్‌లు విధించినట్లు విమర్శలు వస్తున్నాయి.
Read Also: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి, ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి!





