ఆంధ్ర ప్రదేశ్
Trending

మెగా డీఎస్సీ పై కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి!.. ఈసారైనా నిరుద్యోగుల కళ నెరవేరేనా?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒకప్పుడు స్కూల్లో ప్రారంభం నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే నేడు సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తూ…’ ఎస్సీ వర్గీకరణతోనే డీఎస్సీ భర్తీ చేస్తాం’ అని తెలిపారు. 2027 నాటికి పోలవరం కచ్చితంగా పూర్తి చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర రాజధాని అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని… ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా బెస్ట్ మోడల్ తో అమరావతిని అభివృద్ధి చేస్తామని నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభవార్త చెప్పారు. టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడే ఉపాధ్యాయ ఉద్యోగాలు 80 శాతం భర్తీ చేశామని అన్నారు. పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపడుతామని అన్నారు. మెగా డీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచనలు చేశారు. ఇక జూన్ నెలలో పాఠశాలలో ప్రారంభించనుగా టీచర్లకు పోస్టింగులు కూడా ఇస్తామని తెలిపారు. కాగా ఇటీవలనే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి పెద్ద ఎత్తున టీచర్ పోస్టులకు భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో ఒక డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని నారా లోకేష్ విమర్శించారు. గత 30 సంవత్సరాలుగా టిడిపి ప్రభుత్వాల హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 డీఎస్సీ లు నిర్వహించి 1,80, 272 టీచర్ పోస్టులను భర్తీ చేసేమని నారా లోకేష్ లెక్కలను విడుదల చేశారు.

ఏపీలో రెండో విడత ఆధార్ నమోదు క్యాంపులు!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button